సంధ్య థియేటర్ ఘటన.. పోలీసుల తీరుపై NHRC ఆగ్రహం.. అన్నీ తప్పులే అంటూ..

1 year ago 31
హైదరాబాద్‌లోని సంధ్య థియేటర్‌లో ‘పుష్ప 2’ ప్రీమియర్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో ఒక మహిళ మృతి చెందగా.. ఆమె కుమారుడు గాయపడ్డాడు. ఈ ఘటనపై జాతీయ మానవ హక్కుల కమిషన్ (NHRC) హైదరాబాద్ పోలీసుల నిర్లక్ష్యంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. పోలీసులు సమర్పించిన నివేదికలో వివరాలు లోపించాయని మొట్టికాయలు వేస్తూ, అల్లు అర్జున్ రాక, డీజేల హంగామాను పోలీసులు ఎందుకు నియంత్రించలేదని ప్రశ్నించింది. పోలీసులు నిర్లక్ష్యంగా ఉన్నట్టు అర్థమవుతోందని పేర్కొంటూ, ఆరు వారాల్లోగా సమగ్ర నివేదికను సమర్పించాలని సిటీ సీపీ సీవీ ఆనంద్‌కు నేరుగా నోటీసులు జారీ చేసింది.
Read Entire Article