సంగారెడ్డి: 2 నెలల కిందట భర్త.. ఇప్పుడేమో భార్యాపిల్లలు.. చక్కని కుటుంబాన్ని చిదిమేసిన విధి.!

3 months ago 17
సంగారెడ్డి జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. ఓ తల్లి.. తన ఇద్దరు పిల్లలకు విషమిచ్చి.. ఆపై తానూ ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. కంది మండలం జూలకల్ గ్రామంలో ఈ విషాదం చోటుచేసుకుంది. మమత అనే 28 ఏళ్ల మహిళ ఈ కఠిన నిర్ణయం తీసుకుంది. స్థానికులు వెల్లడించిన వివరాల ప్రకారం.. మమత భర్త ఈ ఏడాది జనవరిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడు. భర్త చనిపోవటంతో ఇంటి పెద్ద దిక్కును ఆ కుటుంబం కోల్పోయింది. భర్త చనిపోయిన మనస్తాపంతో మమత.. కొడుకు మణికంఠ, కుమార్తె ప్రళయకు విషమిచ్చి.. ఆపై తాను కూడా ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు అక్కడకు చేరుకున్నారు. స్థానికులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం పోస్టుమార్టం కోసం మృతదేహాలను ఆస్పత్రికి తరలించారు.
Read Entire Article