బీజేపీ ఎమ్మెల్యే రాకేశ్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. కాలేజీ విద్యార్థినులకు స్కూటీలు ఇస్తామని ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ అమలు చేయలేదని ఆరోపించారు. కాంగ్రెస్ నేతల షోరూమ్‌ల నుంచి స్కూటీలు తీసుకెళ్లాలని ఈ సందర్భంగా కాలేజీ స్టూడెంట్స్‌కు పిలుపునిచ్చారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. బీజేపీ అధికారంలోకి వస్తే ఫీజు రీయింబర్స్‌మెంట్‌పైనే తొలి సంతకమని ఎమ్మెల్యే తెలిపారు.