షాబాద్ ఆరు హత్యల ఘటనపై మాజీ మంత్రి హరీశ్ రావు సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు చేశారు. పోక్సో కేసులో నిందితుడైన రాజ్‌కుమార్‌ను సమయానికి అరెస్ట్ చేయకపోవడంతోనే ఈ దారుణం జరిగిందని విమర్శించారు. నిందితుడిని సీఎం రేవంత్ సన్నిహితుడు కాపాడారని ఆరోపించారు. ఈ కేసులో పోలీసుల పనితీరుపైనా హరీశ్ రావు ప్రశ్నలు లేవనెత్తారు.