పోక్సో కేసులో నిందితుడిగా ఉన్న ఓ వ్యక్తి.. బాధిత మైనర్ బాలికను కిడ్నాప్ చేయడం రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపుతోంది. బాలికపై అఘాయిత్యానికి పాల్పడిన కేసులో నిందితుడిని అరెస్ట్ చేసి పోలీసులు రిమాండ్‌కు పంపలేదని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం బాలిక, ఆమెను కిడ్నాప్ చేసిన నిందితుడి కోసం ప్రత్యేక పోలీసు బృందాలు గాలింపు చేపట్టాయి. ఇటీవల సంచలనం సృష్టినంచిన షాబాద్ ఘటన మరువకముందే.. ఈ కేసులో పోలీసుల నిర్లక్ష్యం వహించారని స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.