తెలుగు రాష్ట్రాలను ఉలిక్కిపడేలా చేసిన షాబాద్ ఆరు హత్యల కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో నిందితుడు రాజ్‌కుమార్‌పై పోలీసులు రూ. 2 లక్షలు రివార్డు ప్రకటించారు. రాజ్ కుమార్ ఆచూకీ చెప్పిన వారికి ఈ నగదు అందిస్తామని ప్రకటించారు. ఈ కేసును వివిధ కోణాలలో దర్యాప్తు చేస్తున్న పోలీసులు.. పది ప్రత్యేక బృందాలతో నిందితుడి కోసం గాలిస్తున్నారు. ఈ క్రమంలోనే రివార్డు ప్రకటించారు. మరోవైపు షాబాద్ ఎస్ఐను అధికారులు సస్పెండ్ చేశారు.