రంగారెడ్డి జిల్లా షాబాద్‌లో ఆరుగురిని దారుణంగా హత్య చేసిన నిందితుడు రాజ్‌కుమార్ ఇంకా దొరకలేదు. ముందు ఆత్మహత్య చేసుకున్నాడని భావించినా.. అతడు తప్పించుకు పారిపోయినట్లు గుర్తించారు అతడి కోసం 10 పోలీస్ బృందాలు గాలిస్తున్నాయి. పోక్సో కేసు పెట్టినందుకు కక్ష పెంచుకున్న నిందితుడు.. మైనర్ బాలిక, ఆమె తల్లి, నానమ్మతో పాటు తన భార్య, ఇద్దరు పిల్లలను హత్య చేశాడు. నందిగామ రైల్వే స్టేషన్ నుండి అతడు రైలెక్కి పారిపోయినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. బాధితుల బెదిరింపుల ఫిర్యాదులను నిర్లక్ష్యం చేసినందుకు గానూ షాబాద్ ఎస్సై రమేశ్‌ను కమిషనర్ సస్పెండ్ చేయగా.. నిందితుడిని ఉరితీయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.