తెలంగాణ డీజీపీగా పదవీ విరమణ చేస్తున్న డీజీపీ శివధర్‌రెడ్డికి రేవంత్ సర్కార్ కీలక బాధ్యతలు అప్పగించనున్నట్లు సమాచారం. ఆయన్ను స్టేట్ సెక్యూరిటీ అడ్వైజర్‌గా నియమించినట్లు తెలిసింది. సీఎస్ హోదాతో ఆయన మూడేళ్ల పాటు ఈ బాధ్యతల్లో ఉండనున్నారు. అదే సమయంలో.. రాష్ట్ర నూతన డీజీపీగా సీనియర్ ఐపీఎస్ సీవీ ఆనంద్ నేడు బాధ్యతలు చేపట్టనున్నారు. 1991 బ్యాచ్‌కు చెందిన సీనియర్ ఐపీఎస్ సీవీ ఆనంద్ పూర్తి స్థాయి డీజీపీగా రెండేళ్ల పాటు కొనసాగనున్నారు.