హైదరాబాద్ శంషాబాద్ విమానాశ్రయ సమీపంలోని తొండుపల్లి గ్రామంలో రూ.400 కోట్ల విలువైన 8 ఎకరాల ప్రభుత్వ భూమిని ఒక మాజీ స్థానిక ప్రజాప్రతినిధి అక్రమంగా ఆక్రమించాడు. సర్వే నంబర్ 163లోని ఈ స్థలంలో ఉన్న ప్రభుత్వ బోర్డును ప్రైవేటు భూమిలోకి మార్చేసి అధికారుల కళ్లు గప్పి ఐదారేళ్లుగా కౌలుకు ఇస్తూ వ్యవసాయం చేయిస్తున్నాడు. ఇటీవల అక్కడ తాత్కాలిక నిర్మాణాలు కూడా ప్రారంభించడంతో స్థానికులు రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేశారు. ప్రభుత్వ భూమిని కాపాడటానికి హైడ్రా అధికారులు తక్షణమే స్పందించి చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.