బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు కీలక డిమాండ్‌ను తెరపైకి తీసుకువచ్చారు. శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు ఎన్టీఆర్ పేరు పెట్టాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పార్టీని పెట్టి.. అధికారంలోకి వచ్చిన ఎన్టీఆర్ పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం.. ఆయన ఆనవాళ్లను తుడిచేసే విధంగా ప్రయత్నాలు చేస్తోందని మండిపడ్డారు. అదే విధంగా కేపీహెచ్‌బీలో ఎన్టీఆర్ స్కూల్ నిర్మాణం పూర్తి చేసే బాధ్యత కాంగ్రెస్ సర్కార్‌దేనని మాధవరం కృష్ణారావు తేల్చి చెప్పారు.