వైసీపీ హయాంలో రసాయనాలతో తిరుమల లడ్డూ తయారీ.. పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు

5 months ago 34
జనసేన పార్టీ జనరల్ బాడీ సమావేశంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. రసాయనాలతో తిరుమల లడ్డూ ప్రసాదం తయారు చేసి వైసీపీ మహాపరాధం చేసిందని ఆరోపించారు. తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి కేసులో సిట్ నివేదికలోని అంశాలను వైసీపీ కప్పిపుచ్చి.. విష ప్రచారం చేస్తోందని పవన్ కళ్యాణ్ ఆరోపించారు. నెయ్యిలో జంతు కొవ్వు లేదని సిట్ నివేదికలో ఎక్కడా పేర్కొనలేదని.. లడ్డూలో వినియోగించిన నెయ్యి అసలు నెయ్యే కాదని విమర్శించారు. రూ.400కి కిలో నువ్వుల నూనె దొరకదన్న పవన్ కళ్యాణ్.. అలాంటిది ఆవు నెయ్యి ఎలా ఇచ్చారని ప్రశ్నించారు. ప్రజలకు ఈ వాస్తవాలను తెలియజేయాలని జనసేన పార్టీ సర్వసభ్య సమావేశంలో సూచించారు.
Read Entire Article