వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోకి సెల్ ఫోన్!.. తిరుమలలో కలకలం..

1 month ago 12
పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమలలో మరోసారి నిర్లక్ష్యం వెలుగుచూసింది. తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోకి ఓ భక్తుడు సెల్ ఫోన్‌తో ప్రవేశించారనే వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ కంపార్టుమెంట్లో ఉన్న సమయంలో భక్తుడు తన సెల్ ఫోన్ ద్వారా వీడియో రికార్డు చేసినట్లు వార్తలు వస్తున్నాయి. అత్యంత కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు ఉండే తిరుమలలో.. భక్తుడు ఫోన్‌తో వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోకి ప్రవేశించారనే వార్త ఇప్పుడు కలకలం రేపుతోంది. దీనిపై తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు స్పందించాల్సి ఉంది.
Read Entire Article