వీరి దేశభక్తికి హ్యాట్సాఫ్.. కన్నవాళ్లని, కడుపున పుట్టిన వాళ్లను వదిలి విధులకు

1 year ago 27
ఇప్పటికి కూడా మన దేశంలో సైనికులుగా పనిచేసేందుకు చాలా కుటుంబాలు ఇష్టపడకపోయినా, కొందరు మాత్రం దేశభక్తితో తమ పిల్లలను పంపుతున్నారు. నాగర్‌కర్నూల్ జిల్లాలోని గొరిట గ్రామంలోని 42 మంది జవాన్లు దేశం కోసం ప్రాణాలర్పించడానికి సిద్ధంగా ఉన్నారు. ఆపరేషన్ సిందూర్ నేపథ్యంలో సెలవులు రద్దు కావడంతో జవాన్లు విధులకు హాజరయ్యేందుకు వెళ్తున్నారు. ఇలాంటి ఉద్రిక్త పరిస్థితుల్లో కూడా కన్నవాళ్లని, కడుపున పుట్టిన వాళ్లని వదిలి విధి నిర్వహణ కోసం వెళ్తున్నారు. ఈ క్రమంలో ఒక జవాను తన పిల్లలకు వీడ్కోలు పలుకుతున్న దృశ్యం అందరినీ కదిలిస్తోంది.
Read Entire Article