ఎక్కడైనా దొంగతనం చేస్తే.. త్వరగా అక్కడి నుంచి పారిపోవాలని... ఏ దొంగైనా ఆలోచిస్తాడు. సాధారణంగా దొంగల నేచరే ఇంత... కానీ, ఈ దొంగ మాత్రం... తన పేరు గోడ మీద రాసి... మంచిగా అన్నం తిని... ఆ తర్వాత పుచ్చకాయ తిని.. అక్కడి నుంచి చక్కాపోయాడు. ఈ వింత చోరీ ఘటన బాపట్ల పట్టణంలోని రైలు పేటలో చోటుచేసుకుంది. ఇంట్లోని 25 వేలు చోరీ చేసిన దొంగ.. ఇంటి సభ్యుల ఫోటోపై రెడ్ మార్క్ వేసి వెళ్లడం గమనార్హం.