విశాఖలో భూకంపం.. తెల్లవారుజామున ఉలిక్కిపడ్డ జనం

1 week ago 7
విశాఖ నగరంలో ఈ తెల్లవారుజామున భూమి కంపించింది. రిక్టర్ స్కేల్‌పై దాని ప్రభావం 4.5గా నమోదైంది. ఉదయం 5:08 గంటలకు భూమి కంపించినట్లు సమాచారం. కాకినాడకు 225 కిలోమీటర్ల దూరంలో బంగాళాఖాతంలో 10 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు అధికారులు గుర్తించారు. అయితే, ప్రస్తుత భూకంప ప్రభావంతో ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టాలు చోటుచేసుకోలేదు. ప్రపంచ వ్యాప్తంగా వరుస భూకంపాలు సంభవిస్తుండటంతో అందరూ అలెర్ట్ అయ్యారు. సునామీ వచ్చే అవకాశం ఉందేమోన్న కోణంలో అధికారులు పరిశీలిస్తున్నారు.
Read Entire Article