Visakhapatnam Thousand Beds Super Specialty Hospital: ఏపీ ప్రభుత్వం విశాఖపట్నానికి సంబంధించిన ప్రాజెక్టులకు భూమిని కేటాయించింది. నగరంలో అదానీ గ్రూప్ సూప్ స్పెషాలిటీ ఆస్పత్రి, ఇంటర్నేషనల్ స్కూల్, స్కిల్ అకాడమీతో పాటుా ఆయా ప్రాజెక్టుల్ని ఏర్పాటు చేయనుంది. ఈ మేరకు మొత్తం 60.29 ఎకరాలను కేటాయించింది. మొత్తం 13 ఎకరాల్లో రూ.713 కోట్లతో ఈ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిని నిర్మించునున్నారు. ఈ భూమిని ఎకర రూ.15 లక్షల రాయితీ ధరతో కేటాయించారు.