Visakhapatnam Digi Rythu Bazaars With Low Prices: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రాంభించిన డీజీ రైతుబజార్లకు ప్రజల నుంచి మంచి స్పందన వస్తోంది. డీజీ రైతు బజార్లలో నామమాత్రంగా డెలివరీ ఛార్జీల వసూలు చేస్తున్నారు. దీంతో వినియోగదారుల నుంచి ఆదరణ పెరుగుతోంది. జూన్ నెలలో ఆర్డర్లు 5,800 దాటాయి.. దీంతో నగరంలోని మరికొన్ని ప్రాంతాల్లో ఈ డీజీ రైతు బజార్లను విస్తరిస్తామని అధికారులు చెబుతున్నారు. విశాఖ మాత్రమే కాదు రాష్ట్రంలోని పలు నగరాలు, పట్టణాలలో ఈ సేవలు అందుబాటులోకి వచ్చాయి.