Visakhapatnam Steel Plant Officials Suspensions: విశాఖపట్నం స్టీల్‌ప్లాంట్‌లో ప్రమాదం తర్వాత ఉన్నతాధికారులు తనిఖీలు చేపట్టారు ఈ క్రమంలో మెటీరియల్ నాసిరకంగా ఉందని గుర్తించారు.. దీంతో కీలక చర్యలు తీసుకున్నారు. అధికారులను సస్పెండ్ చేశారు.. SMS-1, SMS-2 విభాగాలతో పాటు క్యూఏటీడీలో పనిచేస్తున్న సీనియర్ అధికారులు ఉన్నారని చెబుతున్నారు. ఇప్పటికే ముగ్గురు జనరల్ మేనేజర్లు (GMలు), నలుగురు డిప్యూటీ జనరల్ మేనేజర్ల (DGMలు)ను కూడా బదిలీ చేసిన సంగతి తెలిసిందే.