ఆంధ్రప్రదేశ్ ప్రజల చిరకాల కోరిక నెరవేరుతోంది. రేపటి నుంచి దక్షిణ కోస్తా రైల్వే జోన్ ప్రారంభం కానుంది. ఈ విషయాన్ని ఏపీ బీజేపీ అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ తెలిపారు. విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ కోసం బీజేపీ 30 ఏళ్ల నుంచి పోరాటం చేసిందని వెల్లడించారు. ఇక విశాఖపట్నం కేంద్రంగా త్వరలోనే బుల్లెట్ రైలు రానున్నట్లు రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ తనతో చెప్పినట్లు మాధవ్ వెల్లడించారు. ఈ సందర్భంగా రైల్వే మంత్రికి మాధవ్ ధన్యవాదాలు తెలియజేశారు.