తెలంగాణ ప్రభుత్వం విద్యా రంగంలో కీలక సంస్కరణలకు శ్రీకారం చుట్టింది. 2026-27 విద్యాసంవత్సరం నుంచి ఫీజు రీయింబర్స్‌మెంట్ చెల్లింపుల్లో కొత్త విధానాన్ని అమలు చేయనుంది. ముందుగా దరఖాస్తు చేసుకున్న విద్యార్థులకే నిధుల విడుదలలో ప్రాధాన్యత ఇవ్వడంతో పాటు, ఏ ఏడాది ఫీజులు ఆ ఏడాదే చెల్లించేలా ఎస్సీ సంక్షేమ శాఖ ప్రతిపాదనలు సిద్ధం చేసింది. మరోవైపు.. విద్యా వ్యవస్థలో సంస్కరణల నేపథ్యంలో ఇంటర్ అడ్మిషన్ల షెడ్యూల్‌ను బోర్డు తాత్కాలికంగా రద్దు చేసింది.