విద్యాబోధన నుంచి వసతి దాకా.. అన్నీ ఫ్రీ.. రూపాయి కట్టక్కర్లేదు.. జత దుస్తులతో వస్తే చాలు..

6 months ago 16
సిద్దిపేట జిల్లా కొండపాకలోని శ్రీసత్యసాయి ప్రశాంతి నికేతనం బాల మందిర ట్రస్టు పేద విద్యార్థులకు ఉచిత విద్య, వసతిని అందిస్తోంది. 'వన్ వరల్డ్ వన్ ఫ్యామిలీ మిషన్' ద్వారా 6వ తరగతి నుంచి ఇంటర్ వరకు ఇంగ్లీష్ మీడియంలో నియోస్ (NIOS) విధానంలో బోధన సాగుతుంది. అకడమిక్ విద్యతో పాటు సంగీతం, నాట్యం, డ్రైవింగ్, వంటలు, జీవన నైపుణ్యాల్లో శిక్షణ ఇస్తారు. ఉన్నత చదువుల కోసం డిగ్రీ, పీజీ, పీహెచ్‌డీ కోర్సులను కూడా ఉచితంగా పూర్తి చేయవచ్చు. ఈ నెల 20వ తేదీ వరకు ప్రవేశాలకు అవకాశం ఉంది. ఆసక్తి గల విద్యార్థులు https://srisathyasailokasevagurukulam.org/ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని ప్రిన్సిపల్ పూర్ణిమ సూచించారు.
Read Entire Article