Parivartan Rajneeti Party Already Same Name: విజయసాయి రెడ్డి పరివర్తన రాజనీతి పార్టీ (PRP)ని ఏర్పాటు చేయగా.. ఇప్పుడు అదే పేరుతో ఇప్పటికే మరో పార్టీ ఉందనే చర్చ జరుగుతోంది. ఈ క్రమంలో పరివర్తన రాజనీతి పార్టీ ఎక్స్ ద్వారా స్పందించింది. ఢిల్లీలో తమ పార్టీ పేరుతోఇంకొక పార్టీ ఉందని బహుశా అప్రూవల్ రాకపోవచ్చు అంటున్నారని.. ఈ విషయంలో ఎవరికి దిగులు అవసరం లేదన్నారు. ఈ విషయంలో ఇప్పటికే సంప్రదింపులు జరుపుతున్నట్లు చెప్పుకొచ్చారు.