విజయవాడ సింగ్‌నగర్‌లో మళ్లీ వరదలు.! విపత్తుల నిర్వహణ సంస్థ క్లారిటీ..

1 year ago 21
బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావంతో ఏపీలో పలుచోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలోనే విజయవాడ సింగ్ నగర్‌లో మళ్లీ వరదలు అంటూ ప్రచారం జరిగింది. బుడమేరు వాగు ఉప్పొంగటంతో గతేడాది సృష్టించిన బీభత్సం తెలిసిన సంగతే. ఇప్పుడు మరోసారి సింగ్ నగర్‌లో వరదలు అంటూ వార్తలు రావటంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. అయితే అలాంటిదేమీ లేదని.. అదంతా తప్పుడు ప్రచారమని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ప్రకటించింది. ఏదైనా సమాచారం అవసరమైతే సంప్రదించాలని టోల్ ఫ్రీ నంబర్లు ఏర్పాటు చేసింది.
Read Entire Article