వాహనదారులకు అలర్ట్.. వాహన్ పోర్టల్‌లో మొబైల్ నంబర్ అప్‌డేట్ చేయకపోతే జేబుకు చిల్లే..!

1 month ago 8
తెలంగాణలో వాహనదారులు ట్రాఫిక్ ఈ-చలాన్లు, అధికారిక నోటీసులను మిస్ అయితే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని రవాణా శాఖ హెచ్చరించింది. వాహన యజమానులు తమ ప్రస్తుత మొబైల్ నంబర్లు, ఈమెయిల్ ఐడీలను తక్షణమే వాహన్ పోర్టల్‌లో అప్‌డేట్ చేసుకోవాలని సూచించింది. వాహన్ పోర్టల్‌లో నమోదైన నంబర్‌కు సమాచారం పంపితే.. అది సదరు యజమానికి అధికారికంగా అందినట్లేనని రవాణా శాఖ స్పష్టం చేసింది. సమాచారం అప్‌డేట్ చేయని పక్షంలో నోటీసులు రాలేదనే సాకులు చట్టబద్ధంగా చెల్లవని అధికారులు తేల్చి చెప్పారు.
Read Entire Article