Rajesh Mahasena Letter To Chandrababu Naidu: టీడీపీ నేత రాజేష్ మహాసేన ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్‌లకు లేఖ రాశారు. రాష్ట్రంలో తాజా పరిణామాలు ప్రస్తావిస్తూ.. ప్రభుత్వంపై కుట్ర జరుగుతోందని ఆరోపించారు. ఈ కుట్రల్ని అడ్డుకోవడానికి ఎవరైనా కుల, మత పరమైన అంశాల గురించి మాట్లాడితే వెంటనే వారికి నోటీసులు ఇవ్వాలన్నారు. ఒకవేళ వాళ్లు చేసిన వ్యాఖ్యలకు ఆధారాలు ఇవ్వకపోతే కేసు నమోదు చేయాలని కోరారు.