ఎల్‌నినో ప్రభావంతో రాష్ట్రంలో వర్షాలు తగ్గి, ఎండల తీవ్రత పెరిగే అవకాశం ఉన్నందున రైతులు ఆరుతడి పంటలు సాగు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. వచ్చే ఎనిమిది నెలలు పరిస్థితులు కష్టంగా ఉండవచ్చని.. పంటలు వేసే ముందు నీటి లభ్యతను అంచనా వేసుకోవాలని కోరారు. ప్రాజెక్టుల్లో నీటి నిల్వలు తగ్గాయని, మేడిగడ్డ బ్యారేజీ సమస్యల వల్ల కన్నెపల్లి పంప్‌హౌస్‌పై ప్రభావం పడుతోందని వివరించారు. కాళేశ్వరం, గోదావరి, కృష్ణా జలాలపై డిసెంబర్‌లో అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు నిర్వహించి చర్చిస్తామని తెలిపారు. మరోవైపు కొడంగల్‌లో సాగునీటి ప్రాజెక్టులు, రహదారులు, పరిశ్రమలు, విద్యాసంస్థల అభివృద్ధికి ప్రభుత్వం ప్రణాళికలు చేపడుతోందని వెల్లడించారు.