లైసెన్స్ నుంచి రెన్యూవల్ వరకు.. ఇంటి నుంచే 100 రవాణా సేవలు, RTA ఆఫీసుకు వెళ్లక్కర్లేదు..!

1 week ago 5
ఆర్‌టీఏ కార్యాలయాల్లో రద్దీని తగ్గించేందుకు ఆధార్ ధ్రువీకరణతో 100 రవాణా సేవలను ఆన్‌లైన్ చేయాలని కేంద్ర ప్రభుత్వం గెజిట్ జారీ చేసింది. దీనిని తెలంగాణ రవాణాశాఖ దశలవారీగా అమలు చేయనుంది. వారం రోజుల్లో హైదరాబాద్‌లోని ఖైరతాబాద్ ఆఫీసులో పైలట్ ప్రాజెక్టుగా ట్రాన్స్‌పోర్ట్ వాహనాల రిజిస్ట్రేషన్లు, పర్మిట్ సేవలను ఆన్‌లైన్ ద్వారా ప్రారంభించనున్నారు. పరివాహన్, సారథి పోర్టళ్ల ద్వారా లైసెన్సులు, రిజిస్ట్రేషన్లు, స్క్రాపింగ్, చలాన్లు వంటి 9 విభాగాల సేవలు అందుతాయి. అయితే డ్రైవింగ్, ఫిట్‌నెస్ పరీక్షలకు మాత్రం ఆర్‌టీఏ కార్యాలయానికి వెళ్లడం తప్పనిసరి.
Read Entire Article