లాటరీలో లాండ్ క్రూయిజర్ కారు, రూ.80 లక్షలు.. సర్పంచ్‌కు టోపి పెట్టిన సైబర్ కేటుగాళ్లు

5 days ago 3
సంగారెడ్డి జిల్లా కల్హేర్ మండలంలో ఒక గ్రామ సర్పంచ్ సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడి రూ.4.12 లక్షలు పోగొట్టుకున్నారు. బాధితుడికి రూ.80 లక్షల నగదు, ఖరీదైన ల్యాండ్ క్రూయిజర్ కారుతో పాటు ముంబైలో ఒక విలాసవంతమైన ఫ్లాట్ లాటరీలో వచ్చిందంటూ నమ్మించిన సైబర్ కేటుగాళ్లు.. జీఎస్‌టీ, ప్రాసెసింగ్ ఫీజుల పేరుతో విడతల వారీగా డబ్బులు గుంజారు. ఇందుకోసం నకిలీ సీబీఐ, కస్టమ్స్ డిపార్ట్‌మెంట్ పత్రాలను సృష్టించి సర్పంచ్‌ను నమ్మించారు. ఆ తర్వాత మరిన్ని డబ్బుల కోసం సీబీఐ అరెస్ట్ చేస్తుందంటూ బెదిరింపులకు దిగడంతో మోసపోయానని గ్రహించిన సర్పంచ్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
Read Entire Article