ప్రేమకు భాష, ప్రాంతం అడ్డుకావని ఆదిలాబాద్‌కు చెందిన సాయి చరణ్, లండన్‌కు చెందిన మియా మే నిరూపించారు. ఉన్నత చదువుల కోసం లండన్ వెళ్లిన సాయి చరణ్.. అక్కడ మియా మేతో ప్రేమలో పడ్డారు. ఐదేళ్ల ప్రేమ తర్వాత పెద్దలను ఒప్పించి ఆదిలాబాద్‌లో హిందూ సంప్రదాయ పద్ధతిలో మే 10న వివాహం చేసుకున్నారు. వధువు తల్లిదండ్రులు రాలేకపోవడంతో.. వరుడి మేనత్త దంపతులు కన్యాదానం చేసి ఈ వేడుకను జరిపించడం విశేషం.