రోడ్డుపై దొరికిన రూ. లక్షల విలువైన బంగారం.. కానీ అతని మనసు మేలిమి బంగారం..

5 days ago 6
మనిషన్నవాడు మాయమైపోతున్న ప్రస్తుత పరిస్థితులలో.. ఓ యువకుడు నిజాయితీ అందరితోనూ శెభాష్ అనిపిస్తోంది. రోడ్డుపై లక్షల రూపాయల విలువైన బంగారం దొరికినా కూడా.. పరుల సొమ్ము పామువాంటిదిగా భావించి, దానిని చెందాల్సిన వారికి అందేలా చేసి శెభాష్ అనిపించుకుంటున్నాడు. దీనికి సంబంధించిన వివరాల్లోకి వెళ్తే తూర్పుగోదావరి జిల్లా మండపేటలోని సీతానగరానికి చెందిన శ్రీలేఖ తన కుటుంబంతో కలిసి మే 24వ తేదీన ఓ శుభాకార్యానికి వెళ్లారు. ఆటోలో వెళ్తున్న సమయంలో వారికి చెందిన నగల బ్యాగ్ ఏడిద గ్రామ శివారు ప్రాంతంలో పడిపోయింది. అయితే అదే ఊరికి చెందిన లక్ష్మణరావు అనే యువకుడికి ఆ నగల బ్యాగ్ దొరగ్గా.. బ్యాగులోని ఆధార్ కార్డులో ఉన్న వివరాల ఆధారంగా శ్రీలేఖ కుటుంబానికి సమాచారం అందించారు. అనంతరం పోలీసుల సమక్షంలో వారికి అప్పగించారు. ఈ సందర్భంగా లక్ష్మణరావును పోలీసులు, స్థానికులు అభినందించారు.
Read Entire Article