వికారాబాద్ జిల్లా పెద్దేముల్ మండలం రుక్మాపూర్ రైల్వేస్టేషన్ వద్ద రైల్వే ట్రాక్ పనుల్లో కూలీలుగా పనిచేస్తున్న నలుగురు మావోయిస్టులను మహారాష్ట్ర పోలీసులు ఆదివారం అర్ధరాత్రి అరెస్ట్ చేశారు. వీరిని ఛత్తీస్‌గఢ్ గడ్చిరోలి జిల్లాకు చెందిన వారుగా గుర్తించారు. ఛత్తీస్‌గఢ్‌లో భద్రతా బలగాల నిఘా పెరగడంతో తప్పించుకోవడానికి ఇక్కడికి వచ్చి కూలీల ముసుగులో తలదాచుకుంటున్నట్లు సమాచారం. తాండూరు పోలీసుల సహకారంతో మహారాష్ట్ర పోలీసులు వీరిని అదుపులోకి తీసుకుని తమ రాష్ట్రానికి తరలించారు.