రైలులో గర్భిణికి పురిటినొప్పులు.. టీటీ సహాయంతో 40 నిమిషాలు రైలు ఆపి, మగవారిని దింపేసి ప్రసవం..

3 months ago 18
రైళ్లో ప్రయాణిస్తున్న సమయంలో ఓ ప్రయాణికురాలికి పురిటి నొప్పులు రాగా.. తోటి మహిళా ప్రయాణికులు కలిసి ఆమెకు పురుడు పోసిన ఘటన అనకాపల్లి జిల్లా ఎలమంచిలిలో చోటుచేసుకుంది. ఓ గర్భిణి, శనివారం తన కుటుంబంతో కలిసి చెన్నై నుంచి ధన్‌బాద్‌కు బొకారో ఎక్స్‌ప్రెస్‌లో వెళ్తున్నారు. ఈ సమయంలోనే ఆమెకు పురిటినొప్పులు రాగా.. బోగీలోని తోటి మహిళలు, మహిళా టీటీ, రైల్వే సిబ్బంది సహకారంతో ఆమెకు ప్రసవం చేశారు. ఇందుకోసం ఎలమంచిలి రైల్వేస్టేషన్‌లో రైలును 40 నిమిషాలు నిలిపివేశారు. బోగీలోని మగవారిని కిందకు దింపి రైల్వే సిబ్బంది వారికి సహకరించారు.
Read Entire Article