రైతులకు శుభవార్త చెప్పిన రేవంత్ సర్కార్.. ఎట్టకేలకు అందుబాటులోకి..

6 months ago 23
రైతులు ఆరుగాలం కష్టించి పండించిన ధాన్యాన్ని సరియైన మద్దతు ధరకు విక్రయించుకునేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని పెద్దకొత్తపల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ దండు నరసింహ కోరారు. సోమవారం ఆయన మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు. రైతులతో మాట్లాడి.. వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని అధికారులకు సూచించారు. హమాలీలు అధిక డబ్బులు వసూలు చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. తమ సమస్యలను అడిగి తెలుసుకున్నందుకు రైతులు సంతోషం వ్యక్తం చేశారు.
Read Entire Article