ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రైతులకు ఎరువుల కార్డులు ఇవ్వాలని నిర్ణయించింది. ఈ ఖరీఫ్ సీజన్ నుంచే ఈ నిర్ణయం అమల్లోకి రానుంది. ఎరువులు పక్కదారి పట్టకుండా, అనర్హుల చేతికి వెళ్లకుండా ఉండాలనే ఉద్దేశంతోనే ఈ ఎరువుల కార్డు విధానానికి శ్రీకారం చుడుతోంది. అయితే ఎరువుల కార్డు కోసం రైతులు తమ పంట వివరాలను రైతు సేవా కేంద్రంలో సమర్పించాల్సి ఉంటుంది. ఆ తర్పాత ఒక్కో రైతుకు ఒక్కో ఎరువుల కార్డు మంజూరు చేస్తారని అధికారులు చెప్తున్నారు.