రైతులకు మరో శుభవార్త.. రేపు అశ్వారావుపేటలో ఆ పథకం ప్రారంభం..

4 months ago 15
తెలంగాణలో సన్న, చిన్నకారు, మహిళా రైతులకు మేలు చేసేలా రాష్ట్ర ప్రభుత్వం ‘వ్యవసాయ యాంత్రీకరణ పథకాన్ని’ పునరుద్ధరించింది. రేపు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఈ పథకాన్ని ప్రారంభించనున్నారు. సుమారు రూ. 100 కోట్ల వ్యయంతో ట్రాక్టర్లు, వరి కోత యంత్రాలు, స్ప్రేయర్లను సబ్సిడీపై పంపిణీ చేయనున్నారు. మహిళా రైతులకు 50 శాతం, ఇతర రైతులకు 40 శాతం రాయితీ లభిస్తుంది. అదే వేదికపై 'జాతీయ ప్రకృతి వ్యవసాయ మిషన్', 'మెగా కిసాన్ మేళా'ను కూడా ప్రారంభించనున్నారు.
Read Entire Article