రైతులకు భారీ శుభవార్త చెప్పిన మంత్రి తుమ్మల.. రేపటి నుంచే ప్రారంభం..

8 months ago 30
తెలంగాణలో పత్తి కొనుగోళ్లపై ఏర్పడిన ప్రతిష్టంభన వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు చర్చలతో తొలగిపోయింది. సీసీఐ, జిన్నింగ్ మిల్లుల వివాదం కారణంగా నిలిచిపోయిన కొనుగోళ్లు నవంబర్ 19 నుంచి తిరిగి ప్రారంభమవుతాయి. కఠిన నిబంధనలు, ఎకరానికి 7 క్వింటాళ్ల కొనుగోలు షరతులపై మిల్లర్లు అభ్యంతరం తెలిపిన విషయం తెలిసిందే. రాష్ట్రంలో 45.85 లక్షల ఎకరాల్లో పత్తి సాగు చేయగా.. 27 లక్షల టన్నుల దిగుబడి వచ్చినట్లు అంచనా వేస్తున్నారు. మంత్రి హామీతో రైతులకు కనీస మద్దతు ధర దక్కనుంది.
Read Entire Article