దేశంలోనే తొలిసారిగా సేంద్రియ ఉత్పత్తుల నేరుగా విక్రయాల కోసం తెలంగాణ ప్రభుత్వం టీజీ ఆర్గానిక్స్ యాప్‌ను రూపొందించింది. రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఈ నెల 4న వికారాబాద్ జిల్లా తాండూరులో దీనిని ప్రారంభిస్తారు. 50 వేల ఎకరాల్లో సాగవుతున్న సేంద్రియ పంటలను, కల్తీ లేని ఉత్పత్తులను వినియోగదారులకు చేరవేయడమే దీని లక్ష్యం. మధ్యవర్తుల ప్రమేయం లేకుండా రైతులే నేరుగా ధర నిర్ణయించుకుని విక్రయించేలా ఈ యాప్ వేదికను కల్పిస్తుంది.