రైతులకు తీపి కబురు.. త్వరలో సాదాబైనామా దరఖాస్తుల పరిష్కారం, మంత్రి కీలక ప్రకటన

2 months ago 12
తెలంగాణలో 2020 నుంచి పెండింగ్‌లో ఉన్న సాదాబైనామా దరఖాస్తులను త్వరలోనే పరిష్కరిస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి ప్రకటించారు. గతంలో ఉన్న నిబంధనలను సడలిస్తూ.. ఇకపై కేవలం కొనుగోలుదారు నుంచి మాత్రమే అఫిడవిట్ తీసుకునేలా జీవో 76 విడుదల చేశామని వెల్లడించారు. దీనివల్ల రాష్ట్రవ్యాప్తంగా 9 లక్షల మందికి పైగా రైతులకు మేలు జరుగుతుంది. అలాగే భూ సమస్యల శాశ్వత పరిష్కారం కోసం ప్రతి సర్వే నెంబర్‌కు 'భూధార్' కేటాయించనున్నట్లు తెలిపారు. త్వరలోనే 32 జిల్లాల్లో రీ-సర్వే ప్రారంభిస్తామని మంత్రి పొంగులేటి స్పష్టం చేశారు.
Read Entire Article