రైతులకు అలర్ట్.. 15 రోజుల పాటు యూరియా బంద్..! కారణం ఇదే..

10 months ago 21
తెలంగాణ రైతులకు ఇది ఆందోళన కలిగించే వార్త. పెద్దపల్లిలోని రామగుండం ఎరువుల కర్మాగారం (RFCL)లో యూరియా ఉత్పత్తి నిలిచిపోనుంది. అమోనియా పైపులైన్‌లో లీకేజీ కారణంగా ఉత్పత్తిని 15 రోజుల పాటు నిలిపివేయనున్నారు. దీనివల్ల 50 వేల మెట్రిక్ టన్నుల యూరియా ఉత్పత్తికి అంతరాయం కలగనుంది. ఇది తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రైతులపై తీవ్ర ప్రభావం చూపనుంది. సరఫరాను మెరుగుపరచాలని కేంద్రాన్ని కోరారు. ఈ కొరత బ్లాక్ మార్కెట్‌కు దారితీయకుండా చూడాలని రైతులు కోరుతున్నారు.
Read Entire Article