రైతు భరోసా డబ్బులు రాలేదా..? నో టెన్షన్, మంత్రి తుమ్మల కీలక అప్డేట్

11 months ago 21
తెలంగాణ ప్రభుత్వం 'రైతు భరోసా' పంట పెట్టుబడి సాయం నిధులను సోమవారం విడుదల చేసింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. తొలిరోజు 2 ఎకరాల వరకు ఉన్న 41.25 లక్షల మంది రైతులకు ఎకరానికి రూ. 6 వేల చొప్పున మొత్తం రూ. 2,349.83 కోట్లు వారి ఖాతాల్లో జమ చేశారు. నిధులు జమ కాని రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని రాబోయే 9 రోజుల్లో మిగిలిన అర్హులైన రైతులందరికీ నిధులు జమ చేస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు.
Read Entire Article