తెలంగాణ రైతు డిస్కం ఏర్పాటుకు రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి (ఈఆర్‌సీ) లైసెన్స్ మంజూరు చేసింది. నాలుగు నెలల్లోగా కార్యకలాపాలు ప్రారంభించాలని, వ్యవసాయానికి ఉచిత విద్యుత్ కొనసాగిస్తూ మోటార్లకు మీటర్లు పెట్టవద్దని స్పష్టం చేసింది. ఈ డిస్కం పరిధిలోకి వ్యవసాయం, లిఫ్ట్ ఇరిగేషన్, మిషన్ భగీరథ, మెట్రో వాటర్ సప్లై కనెక్షన్లు రానున్నాయి. ఉద్యోగుల సీనియారిటీ, పెన్షన్ హక్కులకు భంగం కలగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని నవంబర్ 30 లోగా వచ్చే ఏడాది ఛార్జీల ప్రతిపాదనలు ఇవ్వాలని ఈఆర్‌సీ ఆదేశించింది.