వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ నెలల రేషన్ బియ్యాన్ని ఒకేసారి పంపిణీ చేయాలని కేంద్రం నిర్ణయించింది. ఆగస్టు 1 నుంచి నెల రోజుల పాటు (31 రోజులు) రేషన్ దుకాణాలు తెరిచి ఉంటాయి. లబ్ధిదారులు మూడుసార్లు వేలిముద్రలు వేసి సన్నబియ్యం పొందవచ్చు. ఈ-కేవైసీ పూర్తయిన వారికి మాత్రమే రేషన్ అందనుండగా, జులై 31 వరకు గడువు ఉంది. వలసదారులు సొంతూరు వెళ్లకుండా ఎక్కడైనా ఈ-కేవైసీ చేసుకోవచ్చని అధికారులు స్పష్టం చేశారు.