ఫిఫా వరల్డ్ కప్ మ్యాచ్‌ల సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. బార్లు, క్లబ్బులు, మైక్రోబ్రూవరీల పని వేళలను పొడిగించింది. తెల్లవారుజామున 4.30 గంటల వరకు మద్యం విక్రయాలకు అనుమతి ఇచ్చింది. అయితే ఇందుకు కొన్ని షరతులు కూడా పెట్టింది. ఈ వెసులుబాటు కేవలం తెలంగాణ కోర్ అర్బన్ రీజియన్ పరిధిలోని లైసెన్స్ కలిగిన సంస్థలకు మాత్రమే వర్తిస్తుందని ఎక్సైజ్ శాఖ అధికారిక ఉత్తర్వులు వెలువరించింది.