తెలంగాణ ప్రభుత్వం కార్మిక, ఉపాధి, శిక్షణ శాఖ పేరును నైపుణ్య మానవ మూలధనం, జ్ఞాన శిక్షణ కార్యక్రమాల శాఖ (SHAKTI)గా మారుస్తూ జీవో 97 జారీ చేసింది. ఈ నూతన 'శక్తి' శాఖ పరిధిలోకి యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీతో పాటు రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ ఐటీఐలు, అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్లు, పాలిటెక్నిక్ కళాశాలలను తీసుకువచ్చారు. పరిపాలనా సౌలభ్యం, ఉపాధి నైపుణ్యాల పెంపుదల కోసమే ఈ మార్పులు చేసినట్లు తెలిపిన ప్రభుత్వం.. ప్రస్తుత 2026-27 విద్యా సంవత్సర అడ్మిషన్లకు ఎలాంటి అభ్యంతరం ఉండదని స్పష్టం చేసింది.