రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం.. 18 ఏళ్ల తర్వాత ఆ ఉద్యోగులకు ప్రమోషన్లు..

1 year ago 20
తెలంగాణ నీటి పారుదల శాఖలో ఉద్యోగుల పదోన్నతులకు రేవంత్ సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దాదాపు 18 ఏళ్లుగా ఎదురుచూస్తున్న 127 మంది ఏఈఈలకు డీఈఈలుగా పదోన్నతులు లభించనున్నాయి. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చొరవతో ఈ సమస్య పరిష్కారమైంది. 2008 బ్యాచ్ ఏఈఈలకు ప్రమోషన్లు కల్పించేందుకు డీపీసీ ఆమోదం తెలిపింది. త్వరలోనే ప్రభుత్వం దీనిపై అధికారిక ఉత్తర్వులు జారీ చేయనుంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత డీపీసీ ద్వారా ఏఈఈలకు డీఈఈలుగా ప్రమోషన్లు ఇవ్వడం ఇదే తొలిసారి. దీనిపై ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Read Entire Article