సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈసారి కేబినెట్ భేటీని యాదగిరిగుట్టలో నిర్వహించాలని నిర్ణయించారు. అదే సమయంలో ఈనెల 21న జరగనున్న మంత్రివర్గ సమావేశాన్ని కూడా ఈనెల 23కు వాయిదా వేశారు. అయితే గతంలోనూ కేబినెట్ భేటీని.. మేడారంలో నిర్వహించి అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసిన రేవంత్ రెడ్డి.. మరోసారి ఇలా యాదగిరిగుట్టలో నిర్వహించి.. మరోసారి సరికొత్త ఆలోచన చేశారు.