ప్రస్తుత రోజుల్లో ఏ వ్యాపారం విజయవంతం కావాలన్నా కూడా కావాల్సింది మార్కెటింగ్.. మన దగ్గర ఎంత నాణ్యమైన వస్తువులు ఉన్నా మార్కెటింగ్ లేకపోతే గిట్టుబాటు కావడం కష్టం. ఈ విషయాన్ని గుర్తించిన ఓ ఫాస్ట్‌ఫుడ్ సెంటర్ నిర్వాహకుడు.. తన షాపు ప్రారంభోత్సవం కోసం కొత్తగా ఆలోచించారు. రూ.1కే ఎగ్ రైస్, రూ.2లకే గోబీ అందిస్తామంటూ ఆఫర్ ప్రకటించారు. ఈ విషయాన్ని సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేయడంతో జనం ఫాస్ట్‌ఫుడ్ సెంటర్ ముందు క్యూ కట్టారు. ఈ ఘటన నంద్యాలలో చోటుచేసుకుంది.