రూ.35 కోట్లతో కాప్రా చెరువు పునరుద్ధరణ.. స్వ‌చ్ఛందంగా 70 ఎకరాలు ఇచ్చిన రైతులు

3 weeks ago 10
Kapra Lake Restoration: హైదరాబాద్‌లోని కాప్రా చెరువు పునరుద్ధరణ పనులను హైడ్రా రూ.35 కోట్లతో చేపట్టింది. సుమారు 112.80 ఎకరాల ఎఫ్‌టీఎల్ పరిధి కలిగిన చెరువు అభివృద్ధికి స్థానిక రైతులు స్వచ్ఛందంగా 70 ఎకరాల భూమిని అందించేందుకు అంగీకరించారు. ఇప్పటికే 60 శాతం పనులు పూర్తయ్యాయి. చెరువు లోతు పెంపు, పూడిక తొలగింపు, ఇన్‌లెట్‌, ఔట్‌లెట్ వ్యవస్థల మెరుగుదలతోపాటు వాకింగ్ ట్రాక్‌, ఫెన్సింగ్ ఏర్పాటు చేస్తున్నారు. వలస పక్షులకు ఆవాసం కల్పించడం, జీవవైవిధ్యాన్ని కాపాడటం, వరద నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంచడం ఈ ప్రాజెక్టు ప్రధాన లక్ష్యాలుగా హైడ్రా అధికారులు వెల్లడించారు.
Read Entire Article