సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పునరాభివృద్ధి పనులు శరవేగంగా సాగుతున్నాయి. రూ.714.73 కోట్లతో పనులు చేపట్టగా.. ఇప్పటివరకు 71 శాతం పూర్తయ్యాయి. ఉత్తర, దక్షిణ వైపుల ఐకానిక్ భవనాలు, రెండు అంతస్తుల ఎయిర్ కాన్‌కోర్స్, ప్లాట్‌ఫారాలపై రూఫింగ్, ట్రావలేటర్లతో ఫుట్‌ఓవర్ బ్రిడ్జిలు, మల్టీలెవల్ కార్ పార్కింగ్, మెట్రో స్కైవాక్ వంటి సదుపాయాలు కల్పిస్తున్నారు. కొన్ని కీలక నిర్మాణాలు ఇప్పటికే పూర్తయ్యాయి. మిగిలిన పనులు వచ్చే ఏడాది మార్చి నాటికి పూర్తయ్యే అవకాశముందని అధికారులు అంచనా వేస్తున్నారు.