ఆన్‌లైన్ పెట్టుబడి పేరుతో జరిగిన సైబర్ మోసంలో ఓ ప్రభుత్వ ఉద్యోగి రూ.2.22 కోట్లు కోల్పోయాడు. ఫేస్‌బుక్‌లో భారీ లాభాల యాడ్ నమ్మిన అతడిని సైబర్ మోసగాళ్లు వాట్సాప్ గ్రూపుల్లో చేర్చి నమ్మకం కల్పించారు. విడతల వారీగా భారీ మొత్తాలను పెట్టుబడి పెట్టించగా.. రూ.3.1 కోట్ల లాభాలు వచ్చినట్లు నకిలీ యాప్‌లో చూపించారు. డబ్బు విత్‌డ్రా చేసుకునే సమయంలో అదనపు ఛార్జీలు చెల్లించాలని చెప్పడంతో ఈ మోసం వెలుగులోకి వచ్చింది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.